: యేస్సయ్యా నీ వెలుగు ఎంతో గొప్పది

ఆ వెలుగు ద్వారానే కదలితిని

అది ఉహించలేని వెలుగు2                     

అదే...అదే.....జీవపు వెలుగు

                  

1 : దేవా నేను మరణస్థితిలో ఉన్నపుడు

దేవా నీవు వెలుగుగా వచ్చితివి2               

ఓ ప్రభూ నన్ను దర్శించి2                      

ఓ ప్రభువా నన్ను వెలిగించితివి

                                                                   

2 : పాపములతో నిండియున్న నన్ను నీవు

ఈ లోకమునుండి నీవు వేరు చేసియున్నావు2             

నీ కృపావెలుగు నీడలలో నన్ను నడిపి2                     

నీ సత్యవాక్కు తెలిపితివి ఓ ప్రభువా

 

3 :  అందుకే నీ రాజ్యవారసునిగా నన్ను ఎంచి

జీవపు మార్గానికి నను నడిపించావు2                     

పరలోకమునకు మాకు చూపాలని నీకు ఆశ2              

 

అదే జీవపు వెలుగును మాకు ఏర్పరిచావు